రెడ్ టీమ్ లో సేనాపతిగా ఉన్న శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషును తన టీమ్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటుంది. బ్లూ టీమ్ లో సేనాపతిగా ఉన్న హిమజ… వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిని తన టీమ్ సభ్యులుగా చేసుకుంటుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అప్పుడే 24 ఎపిసోడ్స్ ముగిశాయి. ఇక.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం సరికొత్త టాస్క్ ను ఇంటి సభ్యుల కోసం ఇస్తాడు. గార్డెన్ ఏరియాలో ఆ టాస్క్ కు సంబంధించిన అన్ని ఏర్పాటు ముందే చేస్తారు. అక్కడ మూడు డ్రాగన్స్ ఎగ్స్ ఉంటాయి. బర్జర్ మోగగానే మూడు డ్రాగన్ ఎగ్స్ ను ఎవరైతే సొంతం చేసుకుంటారో ఆ ముగ్గురు సభ్యులకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.. అని చెబుతాడు బిగ్ బాస్.
బర్జర్ మోగగానే.. వితిక, శివజ్యోతి, రోహిణి.. ఈ ముగ్గురు డ్రాగన్ ఎగ్స్ ను సొంతం చేసుకుంటారు. తర్వాత రెండు టీమ్స్ డివైడ్ అవుతాయి. రెడ్ టీమ్, బ్లూ టీమ్. రెడ్ టీమ్ సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్ సేనాపతిగా హిమజ ఉంటారు.
రెడ్ టీమ్ లో సేనాపతిగా ఉన్న శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషును తన టీమ్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటుంది. బ్లూ టీమ్ లో సేనాపతిగా ఉన్న హిమజ… వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిని తన టీమ్ సభ్యులుగా చేసుకుంటుంది.
నేనే రాజు నేనే మంత్రి
ఈ టాస్క్ లో భాగంగా రెండు రాజ్యాలు ఉంటాయి. మొదటిది విక్రమపురి రాజ్యం. ఈ రాజ్యం వారికి ఎరుపురంగు జెండాలు ఉంటాయి. రెండోది సింహపురి రాజ్యం. వీళ్లు నీలం రంగు జెండాలను కలిగి ఉంటారు. టాస్క్ బర్జర్ మోగగానే ఎరుపు రంగు జెండాలు ఉన్న వాళ్లు.. వేరే రాజ్యానికి వెళ్లి అక్కడి పోడియంలో తమ జెండాలను పాతాలి. అలాగే నీలం రంగు జెండాల వాళ్లు కూడా వేరే రాజ్యానికి వెళ్లి తమ జెండాలను పాతాలి. అయితే.. ఆ జెండాలను తీసే హక్కు సంబంధిత రాజ్యం వాళ్లకు ఉంటుంది. ఆ సమయంలో వ్యూహాత్మకంగా, తెలివిగా ఆడుతూ ఎండ్ బర్జర్ మోగగానే ఏ రాజ్యం వారి జెండాలు ఎక్కువగా పాతి ఉంటాయో వాళ్లే విజేత. వాళ్లు డ్రాగన్ ఎగ్స్ ఉన్నవాళ్లతో కలిసి సెకండ్ రౌండ్ కు వెళ్తారు.
అయితే.. ఇంటి సభ్యులు ఎంతసేపు టాస్క్ ఆడకుండా డ్రాగన్ ఎగ్స్ కోసమే కొట్లాడటంతో చివరకు ఏ టీమ్ కూడా గెలవలేకపోయింది. దీంతో చివరగా డ్రాగన్ ఎగ్స్ ను సొంతం చేసుకున్న రవి, రాహుల్, అలీ.. ఈ ముగ్గురు కెప్టెన్సీ టాస్క్ కోసం సెకండ్ లేవల్ కు వెళ్లారు. చూద్దాం.. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలుస్తారో?