యాపిల్ పండ్లను తింటే ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. యాపిల్ పండ్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. ఇంకా ఎన్నో లాభాలను యాపిల్ పండ్లు మనకు కలగజేస్తాయి. అయితే మనం మార్కెట్‌లో యాపిల్ పండ్లను కొనేటప్పుడు వాటిపై వివిధ నంబర్లు కలిగిన స్టిక్కర్లు ఉంటాయి గమనించారు కదా. ఆ.. అవును, అవే. అయితే ఆ స్టిక్కర్లు ఎందుకు ఉంటాయో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం మార్కెట్‌లో మనకు కంటికి ఇంపుగా కనిపించే లేదా మనకు ఇష్టమైన పండ్లనే కొనుగోలు చేస్తాం. కానీ వాటిని రసాయనాలు వేసి పండించారా, సహజ సిద్ధమైన ఎరువులు వేసి పండించారా అన్నది మనకు తెలియదు. కానీ వాటిపై ఉండే స్టిక్కర్లు మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తాయి. మరి ఏ నంబర్ ఉంటే పండ్లను ఎలాంటి పద్ధతిలో పండించి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందామా..!
3 లేదా 4 అంకెతో స్టిక్కర్ పండ్లపై ఉంటే…
పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల నెంబర్ ఉండి ఆ నెంబర్ మూడు లేదా నాలుగుతో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజసిద్ధమైన ఎరువులు వాడి పండించారని తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లను తినవచ్చు. కాకపోతే రసాయనాలు కూడా వాడి ఉంటారు కనుక వాటిని శుభ్రంగా కడుక్కుని మరీ తినాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
9 అంకెల నెంబర్ ఉంటే…
పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదు అంకెల నెంబర్ ఉండి, అది 9తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులను ఉపయోగించి అత్యంత సహజ సిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి. ఈ పండ్లు మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవిగా మనం తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లనే మనం తినాలి.
8 అంకెల నెంబర్‌తో ఉంటే…
పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదు అంకెల నెంబర్ ఉండి, అది 8తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లను అస్సలు తిన కూడదు. ఇవి చాలా ప్రమాదకరం. అనారోగ్యాలను కలిగిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.