Bigg Boss 5: నీ చూపు సరిగా లేదు.. లోబోకు పింకీ వార్నింగ్! అస‌లేమైందంటే!!

-

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే ముగ్గురు సభ్యులు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇంకో ఎనిమిది మంది హౌస్ సభ్యులు ఎలిమినేట్ కు సిద్దంగా ఉన్నారు. ఇలా విజ‌యవంతంగా మూడో వారం పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది షో. ఇక.. నిన్న జ‌రిగిన షోలో వైలెన్స్ కంటే ఫ‌న్ అండ్ రొమాన్స్ కే ఎక్కువ స్పేస్ ల‌భించింది.

ఆ వివరాల్లోకి వెళితే.. నామినేష‌న్స్‌, వ‌ర్స‌స్ట్ కంటెస్టెంట్ ఎవ‌రూ.. బెస్ట్ కంటెస్టెంట్ ఎవర‌నే కంటెస్టెంట్ల మ‌ధ్య ఇచ్చుపెట్టిన బిగ్ బాస్.. వారిని కూల్ చేసేందుకు ఇంటి స‌భ్యుల‌కు ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి ఆడారు.

శుక్ర‌వారం షోలో హాట్ బ్యూటీ ప్రియాంక సింగ్‌.. నల్లచీర కట్టుకుని అందంతో ఉడికించింది. అందాలు ఆరబోస్తూ వెళ్తున్న పింకీని చూసి ఫిదా అయిన శ్రీ‌రామ్ .. వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా అని పాట అందుకున్నాడు. సో… బ్యూటీ పుల్ పింకీ అంటూ రొమాంటిక్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత లోబో, ప్రియాంక సింగ్ మధ్య ఖుషి సీన్ మళ్లీ రీ క్రియేట్ జ‌రిగింది.

మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లుగా యాక్టింగ్‌ చేసిన లోబో.. మ‌ధ్య మధ్యలో లోబో..
ప్రియాంక నడుముని ఓరగా చూస్తూ మైమరచిపోయాడు. అలానే చూస్తూ ఉండిపోయాడు. లోబో చూపులను గుర్తుపట్టిన పింకీ.. లోబో.. లోబో.. అని పిలిస్తే అప్పుడు మళ్ళీ సోయలోకి వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు. నీ చూపు సరిగా లేదంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

లోబో మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా దాని కోసం ప్రిపేర్ అవుతున్నాను అంటాడు. దానికి ప్రియాంక సింగ్ మనకి నిన్ననే మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది అంటుంది. దీనికి లోబో షాక్ అవుతాడు. పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగిన నడుము సీన్ లో లోబో ప్రియాంక సింగ్ కాసేపు అలరించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news