జైపాల్ రెడ్డి వయసు 77 ఏళ్లు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాడుగుల జైపాల్ రెడ్డి సొంత ఊరు. 1942 జనవరి 16న ఆయన జన్మించారు. జైపాల్ రెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిలో చేరారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఇవాళ తెల్లవారుజామున ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
జైపాల్ రెడ్డి వయసు 77 ఏళ్లు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాడుగుల జైపాల్ రెడ్డి సొంత ఊరు. 1942 జనవరి 16న ఆయన జన్మించారు. జైపాల్ రెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
జైపాల్ రెడ్డిని చాలారోజుల నుంచి న్యుమోనియా వ్యాధి వేధిస్తోంది. దానితో పాటు తీవ్రంగా జ్వరం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఇవాళ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. జైపాల్ రెడ్డి భౌతికఖాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు.
విద్యార్థి దశ నుంచే జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు సార్లు లోక్ సభ ఎంపీగా, రెండు సార్లు రాజ్య సభ ఎంపీగా గెలిచారు.
జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998లో ఐకే గుజ్రాల్ హయాంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చేవెళ్ల నుంచి గెలిచి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు.