ఉత్తరప్రదేశ్ లో ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారంలో ఉండగా సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాగా బీఎస్పీ నుండి సస్పెండ్ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అంతేకాకుండా బిజెపి నుండి కూడా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సమాజ్ వాదీ పార్టీలో చేరడం ఆసక్తి రేపుతోంది. అంతే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. బీజేపీ పాలన పై ప్రజలు ఆగ్రహం గా ఉన్నారని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బిజెపికి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరకని ఎద్దేవా చేశారు. ఇది ఇలా ఉంటే బీఎస్పీ నుండి సస్పెండ్ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార బిజెపిలో చేరకుండా సమాజ్ వాదీ పార్టీలో చేరడంతో ముఖ్యమంత్రి యోగి కి బిగ్ షాక్ తగిలినట్టైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. కానీ సొంత రాష్ట్రంలో యోగికి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.