ముగిసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు

-

కాసేపటి క్రితమే… పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబీకులు, ముఖ్య నటులు, ప్రభుత్వ పెద్దల మధ్య పునీత్ రాజ్‌ కుమార్‌ ఖననం జరిగింది. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగగా… ఇవాళ తెల్లవారుజాము వరకు అభిమానుల తాకిడి కొనసాగింది. పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయం సందర్శన కోసం… రికార్డు స్థాయిలో 10 లక్షల మంది స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.

ఇవాళ తెల్లవారు జామున 5 నుంచి 7.30 మధ్యలో పునీత్ అంతిమయాత్ర, ఖననం పూర్తయింది. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు నిరాడంబరంగా పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర కొనసాగింది. సంప్రదాయ రీతిలో పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు కొనసాగాయి. ఇక స్టూడియో వెలుపల ఇప్పటికీ వేచి ఉన్నారు వేలాది మంది పునీత్‌ రాజ్‌ కుమార్‌ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news