బాలయ్య అఖండ నుండి బిగ్ అప్డేట్…27న ప్రీరిలీజ్ ఈవెంట్..!

నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా ప్రాగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ట్రైలర్ మరియు పోస్టర్ లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా పై చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.

Bigg update from akhanda
Bigg update from akhanda

ఈ నెల 27 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా బాలయ్య ప్రగ్యాతో ఉన్న ఓ పోస్టర్ ను కూడా అభిమానులతో పంచుకుంది. పోస్టర్ లో బాలయ్య ప్రగ్యా మాస్ స్టెప్పు వేస్తూ కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే సింహా లెజెండ్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అఖండ తో బాలయ్య బోయపాటి కాంబో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది.