Biggboss-8 : విష్ణు‌ప్రియపై బాంబ్ పేల్చిన పృథ్వీ.. రొమాంటింగ్ సాంగ్ వేసిన బిగ్‌బాస్!

-

బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించి 25వ రోజు ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత సీజన్లలోలాగే ఈసారి కూడా లవ్ యాంగిల్‌ను రివీల్ చేశారు. తాజా ప్రోమోలో యాంకర్ విష్ణుప్రియపై తన మనసులోని మాటను పృథ్వీ బయటపెట్టేలా చేశాడు బిగ్‌బాస్.దీంతో ఒక్కసారిగా ఈ ఎపిసోడ్ మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్‌ను ఆడియెన్స్‌కు కలిగేలా చేశారు.తాజా ప్రోమోలో ‘బెలూన్ టాస్క్’ పెట్టారు. ఇందులో పాల్గొన్న పృథ్వీని మాటల్లో పెట్టి విష్ణు ప్రియపై ఉన్న ప్రేమను బయట పెట్టేలా చేశారు బిగ్‌బాస్.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏకంగా 12 మందికి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఉంటుందని, వాళ్లు హౌస్‌లోకి రాకుండా ఉండాలంటే 12టాస్క్ లను హౌస్‌లోని వారు గెలవాలని బిగ్ బాస్ ప్రకటించాడు.రెండు టాస్కులు ఇప్పటికే పూర్తయ్యియి. అయితే, ఒక టాస్క్ విన్ అయ్యి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మెంబర్స్ ఆపగలిగారు.ఇక తాజాగా ‘పట్టుకుని ఉండండి లేదా పగిలిపోతుంది’అంటూ బెలూన్ టాస్క్ ఇచ్చారు. దీంట్లో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ, కాంతారా క్లాన్ నుంచి నబిల్ అఫ్రిది పాల్గొన్నారు. వీరిలో ఎవరు గెలిచారనేది గురువారం రాత్రి తెలియనుంది.‘ఫ్రేమ్ మీద హ్యాండిల్‌కి కట్టి ఉన్న మేకు బెలూన్‌కి తగలకుండా చూసుకోవాలి హౌస్మేట్స్’ అంటూ బిగ్‌బాస్ టాస్క్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ మీద ఉన్న ప్రేమను పృథ్వీతో చెప్పించిన బిగ్‌బాస్ ఓ రొమాంటిక్ సాంగ్ వేసి చాలా సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news