‘అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ మార్చినట్లు బీహార్ సీఎం పార్టీలు మారుస్తారు’

అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్ ను మార్చినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వార్గియా శుక్రవారం ఆరోపించారు. బీహార్ సీఎం ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో అర్థం కావట్లేదన్నారు. ఎవరికీ చెయ్యిస్తారో తెలియడం లేదన్నారు. దీంతో కైలాష్ విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వార్గియా
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వార్గియా

కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వార్గియా విదేశాలకు వెళ్లారు. అక్కడ మహిళలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ ను ఏ క్షణంలో మారుస్తారో వారికే తెలియదని తనతో ఒకరు చెప్పారని ఆయన పేర్కొన్నారు. బీహార్‌ సీఎం కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తారని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. బీజేపీ నాయకులు మహిళలను అగౌరవపరుస్తారమని మండిపడుతున్నారు. కాగా, బీజేపీతో విడిపోయిన నితీష్.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాగట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.