ప్రస్తుతం తెలంగాణ చూపు మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్త్ఊ కానుంది…ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది.
ఈ ఉపఎన్నికల్లో సత్తా చాటితేనే…సాధారణ ఎన్నికల్లో కూడా సత్తా చాటగలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ కీలక ఎత్తుగడలు వేస్తోంది.
రేపు మునుగోడు నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు హాజరుకానున్నారు. దీంతో బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో..బహిరంగ సభకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సభకు లక్షకు తగ్గకుండా జనాలు రావాలని కేసీఆర్ ఆదేశించారట.