ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రికి షాక్, ఇంత పని చేసారా…!

బీహార్ లో ఇప్పుడు ఎన్డియే తిరిగి అధికారంలోకి రావడంతో ఎన్డియే సిఎం అభ్యర్ధి నితీష్ కుమార్… సిఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బిజెపికి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి బీహార్ డిప్యూటీ సిఎంలుగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా బిజెపి తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటి వరకు సుషీల్ మోడీ తిరిగి డిప్యూటి సిఎం అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని కొత్త ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు కటిహార్ ఎమ్మెల్యే అయిన తార్కిషోర్ ప్రసాద్‌ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఆయనను బిజెపి శాసనసభ పార్టీ నాయకుడిగా ఎంపిక చేశారు. బెట్టియా ఎమ్మెల్యే రేణు దేవిని బిజెపి ఉప శాసనసభ పార్టీ నాయకురాలిగా ఎంపిక చేసారు. ఆమె కూడా ఆ పదవి చేపట్టే అవకాశం ఉంది.