కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన బైక్ రేసర్..

-

మద్యం మత్తులో కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతూ తోటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదాలకు కారణం అవుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్‌లో వెలుగుచూసింది.

టోలీచౌకీ నుండి స్పీడ్‌గా వచ్చిన బైక్ రేసర్ ఖాజా ఓ కారును ఢీ కొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద చోటుచేసుకుంది. అయితే, కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం నెలకొంది. అదే టైంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ నిమిత్తం అదే రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్.. ఆ ఇద్దరినీ వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై బైక్ రేసర్ దాడికి పాల్పడ్డాడినట్లు తెలిసింది. దీంతో బాధిత వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news