గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరిగ్గా నెల కిందట ఓ చిటీల వ్యాపారి రూ.100 కోట్లతో రాత్రికి రాత్రే జంప్ అయిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని చిట్టీల పుల్లయ్య గతంలో మేషన్ పని చేసేవాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వారందరితో తన వద్ద చిటీలు వేయించేవాడు. కొంతకాలం వరకు సక్రమంగానే డబ్బులు చెల్లించిన ఆయన రాత్రి రాత్రే రూ.100 కోట్లతో పారిపోయాడు.
దీంతో అతని మీద పలు కేసులు నమోదు అయ్యాయి. నాటి నుంచి వెతుకుతున్న పోలీసులు నిందితుడు చిట్టీల పుల్లయ్యను ఎట్టకేలకు బెంగళూరులో అదుస్టు చేశారు. చిట్టీల పులయ్యపై CCS పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. పుల్లయ్యతో పాటు అదుపులోకి రామాంజనేయులు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం.