రాష్ట్ర అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరోసారి సవాళ్ల పర్వం కొనసాగింది.మంగళవారం ఉదయం సభలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీమంత్రి హరీశ్ రావు నడుమ వాడీవేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్స్ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
దీనికి మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు రిక్యూరిమెంట్ జరిగితే..ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని శ్రీధర్ బాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 వేల ఉద్యోగాలు, గురుకులాల్లో 18 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక 1,913 పాఠశాలలు మూసివేశారు’ అని హరీష్ రావు మండిపడ్డారు.