బ్రేకింగ్‌ : కరోనా బారిన పడిన బిల్ గేట్స్

-

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ఆయన మంగళవారం ట్విట్టర్‌లో.. ‘నేను COVID-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. అయితే… తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను మళ్లీ ఆరోగ్యంగా ఉండే వరకు ఒంటరిగా ఉండటం ద్వారా నిపుణుల సలహాలను అనుసరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

‘నేను టీకాలు వేయడం, పరీక్షలు సహా గొప్ప వైద్య సంరక్షణకు కలిగి ఉండటం నా అదృష్టం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా… బిల్ గేట్స్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతోన్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం… భార్య మిలిండాతో విడాకులు, ఆ తర్వాత మళ్ళీ వివాహం, భారీ దాతృత్వం తదితర ప్రకటనలతో వార్తల్లో నిలిచిన గేట్స్… ఇప్పుడు కరోనా కారణంగా మరోమారు వార్తలకెక్కారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version