పుడ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..

-

ప్రభుత్వ సంస్థలలో పని చేయాలనీ అనుకునేవారికి చక్కటి గుడ్ న్యూస్..మరో ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తాజాగా వెల్లడించారు.ఇప్పుడు ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) ఉద్యోగ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.మొత్తం 4710 పోస్టులను భర్తీ చేయనుంది.

గ్రూప్‌-2,3,4 కేటగిరీల్లో ఈ ఖాళీలు ఊన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. షార్ట్‌ నోటీస్‌ మాత్రమే వెలువడింది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది..

ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు..పూర్తీ వివరాలు..

మొత్తం ఖాళీలు: 4710
కేటగిరీ 2లో 35 పోస్టులు, కేటగిరీ 3 – 2521 పోస్టులు , కేటగిరీ 4 (వాచ్‌మెన్‌) – 2154 పోస్టులు కేటాయించారు.

విద్యార్హతలు: పోస్టులను బట్టి 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://fci.gov.in/ 

లో చూసి పూర్తీ వివరాలను చూసి అప్లై చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version