ఫిబ్రవరి 24 నుంచి బయో ఆసియా సదస్సు

-

బయో ఆసియా అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. 20వ అంతర్జాతీయ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వరకు హెచ్​ఐసీసీలో జరగనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’ నినాదంతో ఈ సదస్సును నిర్వహించబోతున్నామని అన్నారు.


ఈసారి 120 దేశాల నుంచి ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేతలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో 20వ బయోఆసియా సదస్సు నిర్వహణ తేదీలను ప్రకటించారు. లోగో, థీమ్‌లను కేటీఆర్​ విడుదల చేశారు.

రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌ దేశ ఆరోగ్యసంరక్షణ, జీవశాస్త్రాల హబ్‌గానే గాక ప్రపంచ రాజధానిగా ఎదిగిందని కేటీఆర్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో టీకాలను రూపొందించి సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బయోఆసియా సదస్సుకు హైదరాబాద్‌ శాశ్వత వేదిక కావడం ద్వారా తెలంగాణకు ఎనలేని మేలు జరిగిందని చెప్పారు. భారీగా పెట్టుబడులకు మార్గదర్శిగానేగాక గొప్ప పరిశోధనలు, ఆవిష్కరణలకు ఉపకరించింది. ఒక అంతర్జాతీయ సదస్సును 20 సంవత్సరాల పాటు నిర్వహించడం అరుదైన ఘనత అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news