అల్లం నూనె గురించి తెలుసా..? బరువు తగ్గాలనుకునేవారికి సింపుల్‌ చిట్కా..!

-

జీర్ణక్రియకు అల్లంబాగా పనిచేస్తుందని మనకు తెలిసిన విషయమే.. అయితే అల్లంను ఎవరూ అలా తినేయలేరు. పోనీ వంటల్లో ఎక్కువగా వాడదామంటే..దేంట్లో అయితే అల్లం అవసరం ఉంటుందో..ఆ వంటలోనే తగిన పరిమాణంలో వేస్తేనే తినగలం..మంచిది కదా అన్ని వంటల్లో ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే తినలేం. మరి ఎలా..? మీరు అల్లం ఆయిల్‌ గురించి విన్నారా.? జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచటంలో అల్లం ఆయిల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు, పేగు నొప్పి, వాంతులను నివారించటంలో అల్లం ఆయిల్‌ను అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఏం ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే..
బరువు తగ్గించడంలో అల్లం నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనెను వేసి తాగాలి. ఇలా ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్, అదనపు కొవ్వు తొలిగిపోతుంది. అతి ఆక‌లి దూరమవుతుంది. త‌ద్వారా క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు.
ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకుని. అందులో నాలుగు చుక్క‌లు అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, శ్వాస కోశంలో వాపు వంటి స‌మ‌స్య‌లు దెబ్బకిపోతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ యొక్క చెడు ప్రభావాలను తగ్గించడంలో అల్లం నూనె ప్రభావంతగా పనిచేస్తుంది. అల్లం నూనె వయస్సు సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. అల్లం ఎసెన్షియల్ ఆయిల్ ట్రీట్‌మెంట్ అల్సర్‌లను 85% నిరోధిస్తుంది.
అల్లం నూనెను తీసుకున్న తర్వాత నెక్రోసిస్, ఎరోషన్, గ్యాస్ట్రిక్ వాల్ యొక్క రక్తస్రావం వంటి ఇథనాల్ ప్రేరిత గాయాలు గణనీయంగా తగ్గాయని పరీక్షల్లో తేలింది. ఈ ఆయిల్‌ను ముక్కు ద్వారా పీల్చినప్పుడు వికారం తగ్గిస్తుంది.. ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని ఈ ఆయిల్‌ కలిగి ఉంది. జలుబు, ఫ్లూ, దగ్గు, ఆస్తమా వంటి వాటికి సహజ నివారణిగా ఈ ఆయిల్‌ను వాడుకోవచ్చు. అంటువ్యాధులను నయం చేయటంతోపాటు, జెర్మ్స్‌ను చంపే గుణం అల్లం నూనెకు ఉంది. దీనిని యాంటిసెప్టిక్‌గా ఉపయోగించవచ్చు.
అల్లం నూనెను నోటి ద్వారా తీసుకున్నప్పుడు, పేగు ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో మూడు చుక్కలు అల్లం నూనె వేసి తాగితే.. జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేరవు.

Read more RELATED
Recommended to you

Latest news