లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికాలో క్రికెట్ ఆడేందుకు నిర్ణయం తీసుకున్న…బిఫుల్ శర్మ… భారత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. బిపుల్ శర్మ కంటే ముందే.. ఉన్ముక్త్ చంద్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇప్పుడు ఈ ఆల్రౌండర్ కూడా అమెరికన్ లీగ్ లో ఆడబోతున్నాడు. ఐపీఎల్ లో బిపుల్ శర్మ.. పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2016 సంవత్సరంలో ఛాంపియన్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో శర్మ కూడా సభ్యుడు. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు పై సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడంలో బిపుల్ శర్మ కీలక పాత్ర పోషించాడు.
ఎబి డివిలియర్స్ వికెట్ తీసిన బిపుల్ శర్మ.. చివరికి హైదరాబాద్ 8 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇక శర్మ… పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తరపున కూడా రంజీ ట్రోఫీ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 361 పడగొట్టాడు శర్మ.