రోజుకో వైరస్ కేసుల ప్రపంచాన్ని భయపెడుతోంది. ఓవైపు కరోనా ప్రపంచాన్ని కరోనా భయపెడుతోంది. మరోవైపు కొత్తగా ఓమిక్రాన్ ముంచుకోస్తుంది. ఇదిలా ఉంటే కేరళను బర్డ్ ప్లూ వణికిస్తోంది. తాజాగా ఆరాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇంతకు ముందు కేరళలోనే నిఫా వైరస్, జికా వైరస్ వ్యాధులు కలరవరానికి గురిచేశాయి. ఓ వైపు ఇప్పటికే కరోనా వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంది కేరళలో. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కన్నా ఎక్కువ కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేరళలో బర్డ్ ఫ్లూతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్లు, బాతులు, వివిధ రకాల పక్షులు వ్యాధి బారిన పడుతున్నాయి. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంలటున్నారు. ఇందులో భాగంగా కొట్టాయం జిల్లాలో గత రెండు రోజుల్లోనే 16976 బర్డ్ ఫ్లూ సోకిన బాతులను గుంతలో తవ్వి పూడ్చిపెట్టారు. మరోవైపు కేరళ వ్యాప్తంగా ఫారాల్లో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు.