Bird Flu Virus Found In Cow Milk Supply: బర్డ్ ఫ్లూ వైరస్ గురించి తెలియని వారుండరు. అయితే.. ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ మూలాలు బయటపడినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్‌లో చోటు చేసుకుందని తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో పాశ్చరైజ్డ్ ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడలు బయటపడినట్లు సమాచారం అందుతోంది.
అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తి యునైటెడ్ స్టేట్స్ అంతటా పాడి పశువుల మందలలో వ్యాపించిందని ఓ సర్వే వెల్లడించింది. అయితే.. బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఎవరూ కూడా ప్రమాదానికి గురి కాలేదని చెబుతున్నారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.