సంక్రాంతికి నిజమైన రైతులకు రైతు భరోసా : బీర్ల ఐలయ్య

-

తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ నీ ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరం లో అయినా… కేటీఆర్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్న. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. సభకు ఇవాలనైనా వస్తారు అనుకున్న. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారు. కనీసం అందుకైన… సభకు వచ్చి సంతాపం చెప్తారు అనుకున్న అని పేర్కొన్నారు.

ఇక వచ్చే ఏడాదిలో.. హరీష్, కేటీఆర్ లకు సినిమా చూపిస్తాం. అలాగే సంక్రాంతికి రైతులకు రైతు భరోసా పడుతుంది.. నిజమైన రైతులకు రైతు భరోసా పడుతుంది. బీసీలకు అన్యాయం చేసింది BRS.. 2018 లో ఉన్న రిజర్వేషన్ తగ్గించింది BRS. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం.. ఇప్పటికే కవిత బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఫాం హౌస్ లో ఉన్నాడు. హరీష్ కొత్త దారులు వెతుక్కుంటున్నారు అని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news