కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా..? కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఎన్నికలు అనగానే బీసీలు గుర్తుకొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. నిజాంబాద్ జిల్లా సర్పంచ్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ నినాదం తీసుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల అనగానే ఆమెకు బీసీలు గుర్తుకొచ్చారని తెలిపారు. మీ నాన్న, అన్న, మీ కుటుంబం బీసీలు కాదని మీరు వెలుమలు అని గుర్తు చేశారు.

అంతేకాదు మిమ్మల్ని దొరలు అంటారని కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దొంగలు అంటున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పు చేశారని.. బంగారు తెలంగాణను తీసుకొని దరిద్ర, అక్రమ, అవినీతి రాష్ట్రంగా మార్చారని ఆరోపణలు చేశారు. మీ పాలనలు మొత్తం ఎనిమిది లక్షల కోట్లు మాయమయ్యాయని.. అవి ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ముంచేసి ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని సర్పంచ్ల ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. బీసీలరా బయటకి రావాలని ఈ రాజకీయ ఉచ్చుల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని ఆశీర్వదించాలని కేఏ పాల్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news