హెచ్ఐవీ బాధిత మహిళ శరీరంలో ఒమిక్రాన్ పుట్టుక!

-

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతాలకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 89 దేశాలకు పాకింది. అయితే తాజాగా దక్షిణాఫ్రికా దేశ పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవి ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ దేశంలో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవి గురయ్యారని… ప్రపంచ హెచ్ఐవి కేంద్రంగా ఆదేశం మారిందని పేర్కొన్నారు.

ఈ వైరస్ సోకిన వారిలో 30 శాతం కు పైగా మంది అసలు యేంటిరిట్రో వైరల్ డ్రగ్స్ ను తీసుకోవడం లేదని వివరించారు. దక్షిణాఫ్రికా దేశంలో హెచ్ఐవీ రోగులు ఎక్కువ అని.. ఈ రోగుల ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుంది కాబట్టి కరోనా సులువుగా సాగుతుందని వారు తెలిపారు. సరిగ్గా అలాంటి మహిళకే కరోనా సోకిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆమె శరీరంలోని హెచ్ఐవి వైరస్ కారణంగా కరోనా మ్యుటేషన్ లకు గురువు ఒమిక్రాన్ గా మారిందని వివరించారు. ఈ మ్యూటేషన్ ల వల్లే.. ఒమిక్రాన్ వ్యాప్తి సామర్థ్యం సాధించిందని చెప్పారు పరిశోధకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version