జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ పరంగా టాప్ లో ఉండే హీరో అని చెప్పవచ్చు. డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, యాంకరింగ్ పరంగా ఎన్టీఆర్ కు ఎవరు సాటిరారు అని చెప్పవచ్చు. అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ ఏమిటో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ మే 20 -1983 న జన్మించారు. ఇక ఈయన తండ్రి నందమూరి హరికృష్ణ – తల్లి షాలిని. ఎన్టీఆర్ చిన్న వయసు నుండే కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. 1991వ సంవత్సరంలో మొదటిసారిగా తన సినిమాకి క్లాప్ కొట్టించుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైరెక్షన్ లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే హిందీ సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో నటించారు.