గ్యాంగ్ రేప్ : నిందితుల‌కు బిర్యానీలు.. ఆహా ! ఏం పోలీసుల్రా!

-

సామాన్యుల నేరాలు వేరు. ప్ర‌ముఖుల పిల్ల‌ల నేరాలు వేరు. ప్ర‌ముఖుల పిల్ల‌లు అవ్వ‌డంతోనే గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మ‌లుపు తీసుకుంటోంది. ఆ కార‌ణంగానే చాలా అంటే చాలా చీక‌టి  కోణాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయి. ఆ కార‌ణంగానే వాళ్లు హాయిగా స‌క‌ల మ‌ర్యాద‌లూ అందుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లంతా ఉన్నోళ్ల బిడ్డ‌లు.. డబ్బు మ‌రియు ప‌ర‌ప‌తి ప్ర‌ధానంగా ఉన్నోళ్లు. ఇక వారిని ఎవ్వ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు ? అందుకే క‌స్ట‌డీలో ఉన్నా, జైల్లో ఉన్నా స‌క‌ల సౌక‌ర్యాలూ అందిపోతూ ఉంటాయి. వారిని ఎవ్వ‌రూ ఏమీ అన‌రు. వాళ్లంతా టీఆర్ఎస్,ఎంఐఎం పార్టీ ప్ర‌తినిధుల బిడ్డ‌లు. అంటే ఈ దేశానికి వారి అవ‌సరం ఎంతో ఉంది అని పోలీసులు అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగానే భావిస్తూ రాచ‌మ‌ర్యాద‌లూ చేస్తున్నారు నిందితుల‌కు!
ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…

జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల‌కు బిర్యానీలు పెట్టారు పోలీసులు అని వార్త‌లొస్తున్నాయి. సీన్ రీ క‌న్ స్ట్ర‌క్ష‌న్ త‌రువాత జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ కు చేరుకున్న మైన‌ర్ల‌కు వారి ప‌రిచ‌య‌స్థుల ద్వారా స్టార్ హోట‌ల్  నుంచి తెప్పించిన బిర్యానీలు అందాయి. సాధార‌ణంగా క‌స్ట‌డీలో ఉన్న నిందితుల‌కు భోజ‌న ఏర్పాట్లు పోలీసులే చేయాలి. కానీ ఇక్క‌డ మాత్రం ఇందుకు భిన్నంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీంతో నిందితుల విష‌య‌మై పోలీసులు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ప‌లువురు ఆక్షేపిస్తున్నారు. ఓ వైపు దర్యాప్తులో ఎటువంటి పురోగ‌తి లేద‌ని విమ‌ర్శ‌లు వస్తుంటే మ‌రోవైపు నిందితులకు బిర్యానీలు పెట్టించిన వార్త వెలుగులోకి రావ‌డంతో ఈ కేసు విష‌య‌మై పోలీసులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ఈ కేసు విష‌య‌మై మ‌రో ఆరోప‌ణ వినిపిస్తోంది. రాజ‌కీయ జోక్యం కార‌ణంగా ఈ కేసు నీరుగారిపోతోందని తెలుస్తోంది. ఒక మేజ‌ర్, ఐదుగురు మైన‌ర్లూ క‌లిసి చేసిన ఈ నేరాన్ని తీవ్ర స్థాయిలో ప్ర‌తిఘ‌టించి, నిందితుల‌పై క‌ఠిన శిక్ష‌లు అమ‌లు అయ్యే విధంగా చేయాల్సిన రాజ‌కీయ నాయ‌కులు త‌మ పెత్త‌నం మాత్రం పోలీసుల‌పై బాగానే చేలాయిస్తున్నారు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పైకి చట్టం దృష్టిలో అంతా ఒక్క‌టే అని చెప్పి, లోప‌ల మాత్రం చేయాల్సినదంతా చేస్తూనే ఉన్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు ఆధారాలు అనేకం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version