కరోనా వైరస్ విషయంలో కులాలు మతాలు, ప్రాంతాలు, పేద వాడు, డబ్బున్న వాడు ఇలా ఎవరికి అసమానతలు ఉండవు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా కరోనా విషయంలోమాత్రం అలాంటిది ఏమీ ఉండదు. వచ్చింది అంటే తగులుకు౦టది. మొన్నా మధ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా వచ్చిన వ్యక్తి లక్షాధికారి అయినా కోటీశ్వరుడు అయినా సరే గాంధీ ఆస్పత్రిలోనే ఉండాలి.
కాబట్టి ఇక్కడ దేవుడు దయ… ఆ దయ, ఈ దయ అనేది ఏదీ ఉండదు. పాపం ఈ విషయం తెలియక మూర్ఖంగా మాట్లాడారు ఒక పాస్టర్ గారు. ఈ భయంకరమైన వైరస్ కన్నా దేవుడు గొప్పవాడని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని ఒక క్రైస్తవ మతానికి చెందిన ఒక పాస్టర్ వ్యాఖ్యలు చేసారు. అంటే ఆయనకు కరోనా రాదని, కరోనా వచ్చినా దేవుడి ముందు నిలబడలేదు అని ఆ పాస్టర్ గారి భావన.
అమెరికాలోని వర్జీనియాకు చెందిన ‘న్యూ డెలివరెన్స్ ఇవాంజలికల్ చర్చ్’ వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్డ్ గ్లెన్ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసారు. గత నెల 22 న నిర్వహించిన ఒక ప్రార్ధనలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ కి అసలు భయపడవద్దు అని ఆయన సూచించారు. అయితే ఆయన అదే కరోనా వైరస్ సోకి కనీసం చికిత్స కూడా లేకుండా చనిపోయారు. దీనితో ఆ వీడియో ను చర్చ తమ యుట్యూబ్ నుంచి తొలగించింది.