యావత్ దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల మూడ్ స్పష్టంగా కనబడుతోంది కొన్ని నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్ర శాస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. విజయాన్ని అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా అసలు పార్టీలు వదులుకోవట్లేదు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు ఈ క్రమంలో మూడవ సారి హ్యాట్రిక్ విషయం కోసం బిజెపి రాముడు సెంటిమెంట్ ని నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ రైతులని నమ్ముకుంటుందా అనే రాజకీయ వర్గాల్లో చర్చినియాంశంగా మారింది.
పంటలకి కనీస మద్దతు ధరపై చట్టం కోరుతూ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వారికి కాంగ్రెస్ సపోర్ట్ గా నిలిచింది. నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు అందుకోసం అనేక వాటిని ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలోనే దేశంలోని మెజారిటీ హిందువులు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.