తెలంగాణలో పాగా కోసం బిజెపి మునుగోడులో అక్రమ ఉప ఎన్నికను తీసుకువచ్చింది – తమ్మినేని

-

తెలంగాణలో పాగా వేయడం కోసమే బిజెపి మునుగోడులో అక్రమ మార్గంలో ఉప ఎన్నికను తీసుకువచ్చిందని ఆరోపించారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుంది కుంటి సాకు మాత్రమేనని అన్నారు. చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టి బిజెపి అధికారంలోకి వస్తుందని ఆరోపించారు.

రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే, టిఆర్ఎస్ సర్కార్ ను నెల రోజుల్లో కులగొడతానని అమిత్ షా ప్రకటించారని.. అందుకే బిజెపిని ఓడించేందుకు మునుగోడు లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. టిఆర్ఎస్ తో పొత్తు మునుగోడు ఉప ఎన్నిక వరకే ఉంటుందని స్పష్టం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రయత్నాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే కోపం, టిఆర్ఎస్ అంటే ప్రేమ అనేది ఏమీ లేదని.. బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య పోటీ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని.. అసలు సాయుధ పోరాటానికి, బిజెపికి సంబంధమే లేదన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు వారం రోజులపాటు సిపిఎం సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు జరుగుతాయని.. వారోత్సవాలకు సిపిఎం కేంద్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version