తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల హంగామా నడుస్తోంది, అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక మరియు ఇతర వ్యూలపై తమ దృష్టిని సారించాయి. అధికారంలో ఉన్న BRS ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ లు పనిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల గురించి మరియు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ … ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరి తోనే పొత్తులు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. 119 స్థానాలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇక తొందరలోనే ఎన్నికల్లో పాల్గొనే బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. కాగా ఇప్పటికే ఒక లిస్ట్ ను అధికార BRS ప్రకటించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు చాలా హోరాహోరీగా జరగనున్నాయి.
ఇక తెలంగాణాలో ప్రస్తుత సమస్య అయిన ముదిరాజ్ లకు టికెట్ లు ఇవ్వడం అనే అంశంలో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.