జీహెచ్ఎంసీ ఆఫీసర్‌పై చేయి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ఆఫీసర్‌పై బీజేపీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్‌పై జాంభాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్, కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ రెడ్డి చేయి చేసుకున్నట్లు సమాచారం.

అయితే, ఉద్యోగులపై చేయి చేసుకోవడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒక ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని సదరు ఉద్యోగులు నిలదీస్తున్నారు. సర్కిల్ 14కు తాళం వేసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారిపై చేయి చేసుకున్న కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news