జగన్ వైపు బీజేపీ అడుగులు .. ఊబిలో ఇరుక్కున్న పవన్ కల్యాణ్ ??

-

కేంద్రంలో 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బలమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది బిజెపి. అయితే ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల వరుసగా ఇటీవల మహారాష్ట్ర మరియు చత్తిస్ గడ్ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఉత్తర భారతదేశంలోని తిరుగులేదు అని చెప్పుకునే బిజెపి మూడు చోట్ల ఓడిపోవడంతో తాజాగా డైలమాలో పడిపోయి కొద్దిగా తగ్గినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలోని బలమైన శక్తిగా దేశంలోనే మూడవ బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న వైసిపి అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు బిజెపి అడుగులు వేస్తోంది.

మేటర్ లోకి వెళ్తే ఇటీవల జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీ తో భేటీ కావడం జరిగింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరి బేటీ ఏకాంతంగా జరిగినట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. జరిగిన ఈ భేటీలో జగన్ రాష్ట్రానికి సంబంధించి సమస్యలు గురించి అలాగే నిధుల గురించి అనేక విషయాల గురించి మోడీతో చర్చించగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగినట్లు సమాచారం.

 

ఇదే తరుణంలో మోడీ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ తో కలిసి పని చేసే విధంగా జగన్ తో మాట్లాడినట్లు ముఖ్యంగా రాజ్యసభలో బిజెపి కి అండగా నిలబడాలని జగన్ ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బిజెపి జగన్ తో కాళ్ల బేరం రావడానికి రెడీ అయినట్లు వార్తలు రావడంతో..జగన్ ని దెబ్బకొట్టాలని బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి ఆయన రాజకీయ కెరియర్ కి ఇది ఊబిలో కూరుకుపోయే ఇరుక్కుపోయే దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version