బీజేపీ నాయకత్వం దక్షిణ భారత దేశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది..ఉత్తర భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్ రాష్ట్రంతో సహా తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి దీంతో కమలం పార్టీ అగ్రనేతలు దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాయి..ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఆ పార్టీ వ్యూహకర్త, అపర చాణక్యుడు అమిత్‌షా రెండురోజుల పాటు తమిళనాడులో పర్యటించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టి సారించింది..తమిళనాడులో రెండురోజుల పాటు పర్యటించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా..వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీ బ లోపేతంపై దృష్టి సారించారు షా . పార్టీనేతలతోసమావేశం సందర్భంగా ఎన్నికల కోసం ఏమైనా ప్లాన్ ఉందా అని అడిగారు. తర్వాత కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
తమిళనాడులో బీజేపీ జెండా ఎగురవేయాలంటే రజనీకాంత్ లాంటి స్టార్ కావాలి. అందుకే ఇన్నాళ్లు రజినీకోసం వేచి చూశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి..దీంతో రజనీని ఒప్పించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది..డీఎంకే అసంతృప్త నేత, కరుణనిధి తనయుడు అళగిరిని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది..అళగిరిని తీసుకు రాగలిగితే, డీఎంకె ఓట్లను చీల్చడంతో పాటు ఆ పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేయొచ్చన్నది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి..గత రెండు దఫలుగా ఉత్తరభాతర దేశంలోని ఎంపీ సీట్ల సంఖ్య ముఖ్యపాత్ర పోషించాయి..ఒక వేళ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారత దేశ ప్రజల్లో అసంతృప్తి వస్తే..దక్షణ భారత్‌లోని ఎంపీల సీట్లతో మరోసారి అధికారం చేపట్టడంతో పాటు..పార్టీని విస్తరించుకోవచ్చనే వ్యూహం కూడా ఇందులో దాగుంది..గత కొంత కాలంగా బీజేపీ అగ్రనేతలు ముఖ్యంగా మధ్యప్రదేశ్ సీఎం చౌహన్ తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు..అతను అధ్యాత్మిక పర్యటనలో భాగం అయినప్పటికి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది..నివేదిక అధారంగా పార్టీ విస్తరణపై కమలం నేతలు ప్రణాళికలు వేస్తున్నట్లు నెట్టింట్లో వార్త హల్ చల్ చేస్తున్నాయి.