మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బిజెపి అడుగులు…? శివసేన ఎమ్మెల్యేలు జంప్…?

-

మహారాష్ట్రలో అధికార లక్ష్మి కోసం భారతీయ జనతా పార్టీ అడుగుల వేగం పెంచిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా గత మూడు వారాల నుంచి ఉత్కంట రేపుతున్న మహారాష్ట్రలో అధికారం కోసం గత నాలుగు రోజులుగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు. దీనితో మంగళవారం రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో అక్కడి రాజకీయ పార్టీలు వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చర్చలను వేగవంతం చేసాయి.

ఈ పరిణామాల నేపధ్యంలో బిజెపి కూడా దూకుడు పెంచింది. నాగపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తో బిజెపి నేతలు సమావేశమై పరిస్థితిని వివరించారు. దీనిపై ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనేది ఆయన సలహాలు సూచనలు అడిగారు. ఇక ఇప్పుడే అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇతర ఎమ్మెల్యేల మద్దతు కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు బిజెపితో టచ్ లోకి వెళ్ళారని ప్రచారం జరుగుతుంది. ఎన్సీపీ నుంచి కూడా మరో అయిదుగురు సిద్దంగా ఉన్నారని,

వారందరూ కూడా బిజెపికి ఇప్పటికే సందేశం పంపించారు అని అంటున్నారు. ఇక శివసేన నుంచి దాదాపు 20 మంది తమ కుటుంబాల ద్వారా సమాచారాన్ని బిజెపికి పంపినట్టు తెలుస్తుంది. స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 15 మంది బిజెపికి మద్దతుగా ఉన్నారని సమాచారం. వారి అందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. దీనితో ఇప్పుడు బిజెపి ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది స్పష్టత రావడం లేదు. ఏది ఎలా ఉన్నా అధికార లక్ష్మి కోసం ప్రయత్నాలు మాత్రం గంటకో మలుపు తిప్పుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version