బ్రేకింగ్‌: తీవ్ర అస్వ‌స్థ‌కు గురైన రెబల్ స్టార్ కృష్ణం రాజు.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..

-

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు(79) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడగా.. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని బంజరాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు గత కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న‌ట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణం రాజుకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయ‌న చివ‌ర‌గా `రుద్ర‌మదేవి` సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇక‌ రెబల్ స్టార్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version