మరి కొన్ని రోజులలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. కీలక నేతలంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి తెలంగాణలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.
సికింద్రాబాద్ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ ,నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్,చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి,భువనగిరి – బూర నర్సయ్య గౌడ్,ఖమ్మం – డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్లను ఖరారు చేసింది.
మరోవైపు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికే పార్టీలోని పలు కీలక నేతలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.