ఆ పంట పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వబోమని బాంబ్ పేల్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని గుర్తు చేశారు. గంజాయి మీద తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిఘా పెట్టిందని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గంజాయి తో పట్టుబడితే పిడి యాక్ట్ లు పెడతామనీ వార్నింగ్ ఇచ్చారు.

డిసెంబర్ 1 వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుందని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ సర్కార్ అని కొనియాడారు. గతంలో మాఫియాలా తయారు అయి వైన్ షాపులు దక్కించు కునేవారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది.. ఒక టిఆర్ఎస్ సర్కార్ తోనే సాధ్యమని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version