తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు బిజెపి నాయకుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. రాబోతున్న ఎన్నికల్లో తన పోటీ చేసే విషయంపై అనకాపల్లి నుండి అవకాశం ఇవ్వాలని బిజెపి ని కోరడం జరిగిందని చెప్పారు. పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని అది పోవాలని రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాక్షస పాలనని గద్దె దింపాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు సెంటిమెంట్ గా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలో పొత్తు చాలా బాగుందని బాగా సక్సెస్ అయిందని రాబోతున్న ఎన్నికల్లో కూటమిదే విజయం అని అన్నారు.