ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని BRS అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణాలో వర్షాలు భీభత్సంగా వస్తుండడంతో ప్రతిపక్షాలు దీనిని ఆధారంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత డీకే అరుణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని డల్లాస్ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పుడు రాష్ట్రము ఖల్లాస్ లా తయారు అయింది అంటూ అరుణ కామెంట్ చేసింది. రాష్ట్రము మొత్తం వర్షాల ప్రభావంతో గందరగోళంగా ఉంటే… బావ బామ్మర్దులు కేటీఆర్ మరియు హరీష్ రావు లు మాత్రం ఎన్నికల గురించి ఆలోచిస్తూ బిజీ గా ఉన్నారంటూ మండిపడ్డారు. ఇక అసలు ఈ వర్షాల వలన ఎంతమంది ప్రజలు రోడ్డున పడ్డారు ? అదే విధంగా ఎంతమంది మరణించారు అన్నది తెలుసా అంటూ ప్రశ్నించారు అరుణ. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 10 లక్షలు మరియు మొత్తం కోల్పోయిన వారికి రూ. 25 లక్షలు చొప్పున పరిహారంగా అందించాలని ఈమె డిమాండ్ చేశారు.
మరి ప్రభుత్వం దీని గురించి అలోచించి చనిపోయిన వారికి పరిహారం అందిస్తుందా చూడాలి.