ఓడిపోతున్నారు కాబట్టే బీజేపీ నాయకులు ముందస్తుగా ఆరోపణలు చేస్తున్నారు – ఎంపీ రంజిత్ రెడ్డి

-

ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాకులు చెవాకులు మాట్లాడుతోందని మండిపడ్డారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని మేము అడుగుతున్నామని.. కౌంటింగ్ పూర్తి అయితే ధూద్ కా ధూద్, పానికా పాని తెలుస్తుంది కదా అన్నారు. కౌంటింగ్ పూర్తి కాకముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. పోలింగ్ శాతం పై దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.

ఇంకో నాలుగు రౌండ్లు అయ్యే వరకు బీజేపీ లీడర్లు ఓపిక పట్టాలన్నారు. దుబ్బాకలో మేము ఏమైనా మాట్లాడామా?.. ఒడిపోతుంది కాబట్టే బీజేపీ నాయకులు ముందస్తుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు రంజిత్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియ ఫర్ఫెక్ట్ గా నడుస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో ఉందని అందరికీ తెలుసన్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన చౌటుప్పల్ లో టీఆరెస్ ఆధిక్యత సాధించిందన్నారు. ఈ ఎన్నిక కోసం మంత్రులందరూ కష్టపడ్డారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version