హైదరాబాద్ లో రోడ్డెక్కి మరీ తన్నుకున్న బీజేపీ నేతలు

-

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నేతలు రోడ్డు ఎక్కి తన్ను కోవడం సంచలనంగా మారింది. మెట్టుగూడ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన శారద ఆమె భర్త మల్లేష్, బిక్షపతి, రామారావు, మల్లికార్జున్ లు కలిసి తార్నాక డివిజన్ బిజెపి అధ్యక్షుడు రాము వర్మపై తార్నాకలోని నారాయణ స్కూల్ ముందు రహదారిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఈ రెండు వర్గాలు తన్నుకుని రోడ్డుపైన బిజెపి పార్టీ పరువు తీశారని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శారదా, మల్లేష్ దళితులు కావడంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో తమకు అడ్డు అదుపు లేదని భావించి రాము వర్మ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఒక డివిజన్ అధ్యక్షుడినే రోడ్డు మీద బట్టలు చిరిగేలా కొట్టే నాయకులు బిజెపిలో ఉండడం వల్లనే సికింద్రాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఘోరంగా ఓడిపోయిందని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు కొందరు. శారదా మల్లేష్ ను బిజెపి పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version