నిన్న దుబ్బాక ఎన్నికలలో అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల ఇళ్ళ మీద దాడులు, ఆయన ఇంటికి వెళ్ళబోయిన బండి సంజయ్ పోలీసుల అరెస్ట్ ల నేపధ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలకు బీజేపీ పిలుపునిచ్చింది. అంతే కాదు ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, గవర్నర్ లని కలిసి ఈ వ్యవహారం మీద ఫిర్యాదు చేయనున్నారు. ఇక రాత్రి నుండి ఎంపీ బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది.
ఆయన తనంతట తాను కార్యాలయం లోపలి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి పరామర్శించారు. ఇక కార్యాలయం బయట బీజేపీ కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్‌ని ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.