దుబ్బాకలో ఆధిక్యంలోకి బీజేపీ

దుబ్బాక లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. దుబ్బాక లో తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడింగ్ కనబరిచారు. ఆయనకు మిగతా ఇద్దరి కంటే 341 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దుబ్బాక లో బీజేపీ తొలి రౌండ్లో 341 ఓట్ల ఆధిక్యంలో ఉంది ప్రస్తుతానికి. తొలి రౌండ్లో బిజెపి కి 3208 ఓట్లు రాగా టిఆర్ఎస్ కు 2867 ఓట్లు వచ్చాయి అలాగే కాంగ్రెస్కు కేవలం 648 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

అయితే బీహార్ ఎన్నికల విషయంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ కి పట్టం కట్టగా ఇక్కడ దుబ్బాక ఎన్నికల విషయంలో మాత్రం ఒక్కో ఎగ్జిట్ పోల్ ఒక్కోరకమైన ఫలితం ప్రకటించింది. దీంతో ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది అని చెప్పొచ్చు. మొదటి అరగంట లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కాస్త ఆధిక్యత కనపరిచిన రౌండ్ ముగిసే సరికి రఘునందన్ రావు లీడింగ్ లోకి వచ్చారు. తొలి రౌండ్లో 7447 ఓట్ల లెక్కింపు పూర్తి కాగా అందులో 341 ఓట్ల లీడింగ్లో ఉన్నారు రఘునందన్ రావు.