మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార హోరుతో దూసుకెళ్తున్నాయి. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాన్ని మార్చాలంటూ రాష్ట్ర నేతలకు బిజెపి అధిష్టానం ఆదేశాలు పంపింది. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది.
ఇక మునుగోడులో టిఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టిఆర్ఎస్ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా, బిజెపి నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు జాతీయ నేతలు ఇవ్వరు ప్రచారానికి రాలేదు. అయితే త్వరలోనే బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు ప్రచారానికి రాబోతున్నారు. ఈ నెల 31న మునుగోడులో బిజెపి నేతలు ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు.