కొడాలి నానితో రోజా సెల్ఫీ.. ఫోటో వైరల్

-

ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితమైన మనిషిగా, నగరి ఎమ్మెల్యేగా ఉంది రోజా. అయితే ఆంధ్ర రాజకీయాల్లో రోజా ఎంత కీలక నేతనో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఓవైపు రాజకీయాలలో ఎంతో విజయవంతంగా రాణిస్తూనే మరోవైపు, బుల్లితెరపై తన అభిమానులందరికీ అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతూ, తన నవ్వులతో జబర్దస్త్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది రోజా. అయితే ఇటీవల అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి రావడంతో, జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు రోజా. అయితే ఇదంతా పక్కన పెడితే,

తాజాగా కొడాలి నానికి పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పారు రోజా. ఈ మేరకు కొడాలితో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక అటు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు మరియు ప్రియమైన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు అంటూ కొడాలి నాని స్పందించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version