తెలంగాణాలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ హిందు ఓటు బ్యాంకు ని టార్గెట్ చేసింది. రాజకీయంగా తెలంగాణాలో హిందుత్వ వాదం మీదనే బలపడే విధంగా ప్రణాలికలు సిద్దం చేసుకుని ముందుకు వెళ్తుంది. యువత టార్గెట్ గా బిజెపి నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బిజెపి శాసన సభా పక్ష నేత రాజాసింగ్ ఇందిరా పార్క్ గోమహా ధర్నాలో సంచలన వ్యాఖ్యలు చేసారు.
గోరక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తాని ఆయన హెచ్చరించారు. గోరక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదు అని ఆయన గుర్తు చేసారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్ణమని పార్టీ పెద్దలు బ్రతిమలాడారు అని ఆయన పేర్కొన్నారు. గోమాత నా తల్లి.. గోరక్షణ నాధర్మం.. నా కర్తవ్యం అని అన్నారు. ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తా అని, పార్టీనైనా.. పదవినైనా గోరక్షణ కోసం కాళ్ళకింద తొక్కేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని డిమాండ్ చేసారు. పదవులు నాకు లెక్క కాదు అని ఆయన అన్నారు. గోషా మహాల్ నుంచి ఆయన 2018 లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.