ఏసీపీకి చుక్కలు చూపించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

-

మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సిద్దిపేటలో జిల్లా ఏసీపీ వ్యవహరించిన తీరుపై సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా చర్చిని నిర్మిస్తున్న వారిని అడ్డుకున్నందుకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కుకునూరు పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెంటనే పోలీస్ స్టేషన్‌కు తన అనుచరులతో కలిసి వెళ్లారు.

తిమ్మారెడ్డి పల్లిలో అనుమతిలేకుండా చర్చి నిర్మాణం జరుగుతోంది. అధికారులు ఎందుకు అడ్డుకోలేదు. అది అక్రమం అని అడ్డుకున్న వారిని మీరు ఎలా అరెస్టు చేస్తారంటూ ఏసీపీ మీద ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ శ్రేణులతో కలిసి పీఎస్‌కు వెళ్లిన ఆయన అక్కడే బైఠాయించారు. కాసేపు ఏసీపీ, ఎంపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version