సంస్కృతం మాట్లాడితే కొవ్వు త‌గ్గుతోంది… బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ఇటీవ‌ల బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు మ‌రీ సంచ‌ల‌నం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందని ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. పైగా అమెరికాలోని ఓ విద్యాసంస్థ‌లో చేసిన రీసెర్చ్‌లో కూడా ఈ విష‌యం స్ప‌ష్ట‌మైందని ఆయ‌న చెప్ప‌డం విశేషం. ఇంత‌కు సంస్కృతం మాట్లాడితే కొవ్వు త‌గ్గుతోంద‌న్న ఆ బీజేపీ ఎంపీ ఎవరో కాదు గ‌ణేష్ సింగ్‌.

సంస్కృతం మాట్లాడటం వల్ల నరాల వ్యవస్థను పెంచుతుందని.. దీంతో డయాబిటిస్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో సంస్కృతాన్ని ఉపయోగించినట్లైతే, అది ఆగకుండా పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయం నాసా చేసిన ఓ సర్వేలో తేలిందని గణేష్ వెల్లడించడం మరో విశేషం.

అలాగే ప్ర‌పంచంలో వివిధ దేశాల్లో మాట్లాడుతోన్న 97 భాష‌లు సైతం సంస్కృతం నుంచే పుట్టాయ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇస్లామిక్ భాష సైతం సంస్కృతం నుంచే పుట్టింద‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఈ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. సంస్కృత భాష మాట్లాడేందుకు చాలా ఉంటుందని, అందులో ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చని తెలిపారు. బ్రదర్, కౌ అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఈ భాష నుంచే పుట్టినవేనని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news