వైరల్‌: రాముడు, రావణుడి దేశాల్లో పెట్రోల్‌ ధరలపై ఆ ఎంపీ వ్యంగ్యంగా ట్వీట్‌..

-

రోజురోజుకు పెరుగుతున్న ఇంధనాల ధరలతో సామాన్యుడితో పాటు, ధనికులు కూడా బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనాతో అతాలకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుపై ప్రతిపక్షాలతో పాటు బీజేపీ నేతలు కూడా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్‌ ధరలు సెంచరీలో అడుగు పెట్టాయి. క్రమంలో కేంద్రం, బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌ మీద వ్యవసాయ సెస్‌ విధిస్తున్నుట్లు ప్రకటించగా ..ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ సెస్‌ను సుంకం నుంచి మినహాయించి వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు.

ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్యంగా ఫొటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులో.. ‘రామ జన్మభూమిగా పిలువబడే ఇండియాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93 ఉండగా, సీతమ్మవారు పుట్టిన దేశమైన నేపాల్‌లో పెట్రోల్‌ లీటర్‌కు రూ. 53 ఉంది. అయితే రావణుడి జన్మస్థలమైన లంకలో కేవలం లీటర్‌ రూ. 51 మాత్రమే’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇండియాలో ఇంధనం ధరలు పెరిగినప్పుటి నుంచి ఈ ఎంపీ ట్విట్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version