నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలపై బి.జె.పి. పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ స్పందించారు. వై.సి.పి.భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందనిఆగ్రహం వ్యక్తం చేసారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్…మంత్రులతో సమావేశమై ఎన్నికల్లో మెజారిటీ పై సూచనలిచ్చారని పేర్కొన్నారు.
మంత్రులు..ఎమ్.ఎల్.ఏ.లు వచ్చినా వారికి ఆశించిన మెజారిటీ రాలేదన్నారు. వాలంటీర్లు..ఆశ వర్కర్లుతో డబ్బులు పంచారని పైర్ అయ్యారు. నైతికంగా విజయం మాదేనని బి.జె.పి. పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ చెప్పారు. కాగా.. ఈ ఆత్మకూరుఉప ఎన్నికల్లో 82742 ఓట్ల మెజారిటీ తో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో భారీ మెజారిటీ వైసిపి గెలుపొందింది. 20 రౌండ్లు ముగిసే సరికి… 82,742 వేల మెజారిటీ వైసీపీ పార్టీకి వచ్చింది. అటు ఆత్మకూరు ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ. దీంతో బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు ఓటమి తప్పలేదు.